
అల్లు అర్జున్ కజిన్ విరాన్ ముత్తం శెట్టి హీరోగా వేణు మురళీధర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘ముఖ్య గమనిక’. లావణ్య హీరోయిన్. రాజశేఖర్, సాయికృష్ణ నిర్మిస్తున్నారు. శుక్రవారం ఈ మూవీ టీజర్‌ను దర్శకుడు మారుతి విడుదల చేశారు. ‘టీజర్ చాలా ప్రామిసింగ్‌గా ఉంది. విరాన్ పోషించిన కానిస్టేబుల్ పాత్ర ఆసక్తికరంగా ఉంది. ఓ మంచి థ్రిల్లర్ అవుతుంది అనిపిస్తోంది. సక్సెస్ సాధించాలని కోరుకుంటున్నా’ అని మారుతి విష్ చేశారు. ఫిబ్రవరిలో రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నట్టు హీరో విరాన్ చెప్పాడు. . థ్రిల్లింగ్ అంశాలతో సాగే ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామా ఇదని దర్శకనిర్మాతలు తెలియజేశారు. నటీనటులు బాషా, ఆర్యాన్ తదితరులు పాల్గొన్నారు.