ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ముక్కోటి ఏకాదశి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఉత్తర ద్వారం గుండా స్వామివారిని దర్శించుకునేందుకు శుక్రవారం తెల్లవారుజాము నుంచే భక్తులు ఆలయాల దగ్గర బారులుతీరారు. పూజల అనంతరం భక్తులకు ఉత్తర ద్వార దర్శనం కల్పించారు. యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం సహా పాతగుట్ట క్షేత్రంలో స్వామివారు ఉత్తర ద్వార దర్శనం ఇచ్చారు.
ఆగమ శాస్త్రం పద్ధతిలో అర్చకులు వైకుంఠ ఏకాదశి వేడుకను నయనానందకరంగా నిర్వహించారు. ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, కలెక్టర్ హనుమంతరావు, ఐఏఎస్ అధికారి కృష్ణభాస్కర్ వారి వారి ఫ్యామిలీలతో కలిసి స్వామివారిని వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని వేంకటేశ్వరస్వామి ఆలయంలో తెలంగాణ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేశ్‌రెడ్డి కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. - వెలుగు నెట్వర్క్