![సుచిత్రలో ‘ముకుంద జ్యువెలరీస్’ ఓపెన్](https://static.v6velugu.com/uploads/2025/02/mukunda-jewellers-open-showroom-in-suchitra-with-special-offers_rzm7RtfEMp.jpg)
జీడిమెట్ల, వెలుగు: సిటీలోని సుచిత్రలో ‘ముకుంద జ్యువెలరీస్’ షోరూమ్ ఓపెన్అయింది. శుక్రవారం కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద ముకుంద ఎండీ నర్సింహారెడ్డి, డైరెక్టర్లు నిఖితారెడ్డి, క్రిష్ణతో కలిసి ప్రారంభించారు. షోరూమ్‌లోని ఆభరణాలను చూశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వివేకానంద మాట్లాడుతూ.. అతి తక్కువ కాలంలో ప్రజల్లో ఆదరణ పొంది, సుచిత్రలో ముకుంద ఆరో షోరూమ్ ను ప్రారంభించడం అభినందనీయమన్నారు.
కస్టమర్ల నమ్మకాన్ని, అభిమానాన్ని చూరగొని 60 షోరూమ్స్ఏర్పాటు చేసే స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. డైరెక్టర్నిఖితారెడ్డి మాట్లాడుతూ.. మిగతా జ్యువెలరీ షోరూమ్స్, షాప్స్‌కు సాధ్యం కాని ఆఫర్లు అందిస్తున్నామని చెప్పారు. తమది ఫ్యాక్టరీ అవుట్ లెట్ అని, మేకింగ్, మజూరీ చార్జీలు లేకుండా ఆభరణాలను అందిస్తున్నామని తెలిపారు. వీఏ, తరుగు 12 శాతం మాత్రమే ఉంటుందన్నారు.
ప్రారంభ ఆఫర్‌కింద సుచిత్ర బ్రాంచ్‌లో వీఏ, తరుగుపై 20 శాతం డిస్కాంట్ ఇస్తున్నామని చెప్పారు. ఈ నెల 20 వరకూ ఆఫర్ఉంటుందని చెప్పారు.