జైలులో చంద్రబాబును కలిసిన లోకేష్, బ్రాహ్మణి

ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసులో అరెస్టై రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్‌లో ఉన్న టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడుతో ఆయన కుమారుడు టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా లోకేశ్, కోడలు నారా బ్రాహ్మణి ములాఖత్ అయ్యారు.  వారితో పాటు టీడీపీ నేత మంతెన సత్యనారాయణ రాజు కూడా ములాఖత్ అయ్యారు. ఈ సందర్భంగా చంద్రబాబుతో నారా లోకేశ్ దాదాపు 40 నిమిషాల పాటు పలు రాజకీయ అంశాలను చర్చించినట్టుగా సమాచారం. జనసేన, -టీడీపీ సమన్వయ కమిటీలో చర్చించాల్సిన అంశాలపై  లోకేశ్ కు చంద్రబాబు పలు సూచనలు చేసినట్లు తెలుస్తుంది.

 రాజమండ్రిలో టీడీపీ-జనసేన పార్టీల జాయింట్ యాక్షన్ కమిటీ తొలి సమావేశం అక్టోబర్ 23 జరుగనుంది. ఈ సమావేశానికి జనసేన అధినేత పవన్ కల్యాణ్, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పాటు ఇరు పార్టీలకు చెందిన ముఖ్య నేతలు భేటీ కానున్నారు. వచ్చే ఎన్నికల్లో కూటమిగా టీడీపీ-జనసేన పార్టీలు ముందుకు వెళ్లనున్నట్టుగా ప్రకటించాయి. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యూహరచన చేసి రాజకీయ కార్యకలాపాల్లో స్పీడ్ పెంచేందుకు ప్లాన్ చేస్తున్నారు. రెండు పార్టీల మధ్య సమన్వయం కోసం తీసుకోవాల్సిన చర్యలపై ఉమ్మడి కార్యాచరణ ప్రణాళికపై ఇరు పార్టీల నేతలు ఈ మీటింగ్ లో చర్చించనున్నారు.

ALSO READ : జైళ్ల శాఖ డీఎస్పీ.. ఎక్సర్ సైజులు చేస్తూ గుండెపోటుతో మృతి