మూలవాసి బచావో మంచ్​నేత అరెస్ట్

మూలవాసి బచావో మంచ్​నేత అరెస్ట్

మావోయిస్టులకు నిధుల సేకరణ కేసులో అదుపులోకి తీసుకున్న ఎన్ఐఏ


భద్రాచలం,వెలుగు : చత్తీస్​గడ్ లోని బీజాపూర్​జిల్లా కేంద్రంలో మూలవాసీ బచావో మంచ్ నేతను గురువారం రాత్రి ఎన్ఐఏ ( నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ) అరెస్ట్ చేసింది. అతను మావోయిస్టులకు నిధులు సేకరించారని, దేశ వ్యతిరేక కార్యకలాపాలకు వినియోగించారని ఎన్ ఐఏ పేర్కొంది. 

2023 నవంబరులో ఓ కేసులో ఇద్దరు వ్యక్తులను చత్తీస్ గడ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇద్దరు నిందితుల నుంచి రూ.6 లక్షలు స్వాధీనం చేసుకుని ఎంబీఎం(మూలవాసి బచావో మంచ్) సభ్యులుగా గుర్తించారు. ఈ కేసు 2024 ఫిబ్రవరిలో ఎన్ఐఏకు బదిలీ అయింది. దర్యాప్తులో  రఘు మిడియామిని మావోయిస్టులకు నిధుల సేకరణలో కీలకసూత్రధారిగా తేల్చారు. అనంతరం కీలక సమాచారం సేకరించి అతడిని ఎన్ఐఏ అరెస్ట్ చేసింది.