గెలుపుపై ధీమాతో ములాయం కోడలు డింపుల్

ఉత్తరప్రదేశ్ లోని కన్నౌజ్ లోక్ సభ నియోజకవర్గం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.యూపీ రాజకీయ దిగ్గజం ములాయం సింగ్ యాదవ్ కోడలు, ఎస్పీ అధినేత అఖిలేశ్ భార్య డింపుల్ యాదవ్ ఇక్కడ మూడోసారి బరిలో ఉన్నారు. 2012లో ఇదే సెగ్మెంట్ నుంచి డింపుల్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. లోక్ సభ కు పోటీ లేకుండా ఎన్నికైన 44వ వ్యక్తిగా రికార్డు సృష్టించారు. 2014 లో మోడీ ప్రభంజనాన్ని తట్టుకుని మరోసారి లోక్ సభకు ఎన్నికయ్యారు. ఈసారి గెలిస్తే డింపుల్ హ్యాట్రిక్ కొట్టినట్లే.

కన్నౌజ్…ఉత్తర ప్రదేశ్ లోని ఓ కీలక నియోజకవర్గం . ఇప్పుడు ఈ నియోజకవర్గంలోఎక్కడ చూసినా ఒకటే చర్చ. ‘బహు’ డిం పుల్ మూడోసారి గెలుస్తుందా….? హ్యాట్రిక్ సాధిస్తుందా ….? డింపుల్ ను కేవలం ములాయం సింగ్ కోడలు గానే ఇక్కడి ప్రజలు చూడరు. కన్నౌజ్ సెగ్మెం ట్ మొత్తం ఆమెను తమ ఇంటి కోడలు గానే చూస్తుంది . డింపుల్ ఎన్నికల ప్రచారానికి ఎస్పీ, బీఎస్పీ,  ఆర్ ఎల్డీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో వస్తున్నారు. ‘బహు’ మాటలను శ్రద్ధగా వింటున్నారు.

నియోజకవర్గంలో చాలా మందిని డింపుల్ పేరు పెట్టి పిలుస్తారు. ఆ స్థాయిలో ఆమెకు పరిచయాలున్నాయి. అందరూ ఆమెను ‘భాభీ’ అంటూ ప్రేమగా పలకరిస్తారు. ఆమె చెప్పే మాటలను శ్రద్ధగా విం టారు. ఈ కారణంతోనే 2017 అసెంబ్లీ ఎన్నికల్లో సమాజ్ వాది పార్టీకి ఆమె స్టార్ క్యాంపెయినర్ గా ఉన్నా రు. బిజీ షెడ్యూల్ కారణంగా అఖిలేశ్ తిరగలేకపోయిన కొన్ని అసెంబ్లీ సెగ్మెంట్లలో డింపుల్ పర్యటించారు. సమాజ్ వాది పార్టీ తరఫున జనం దగ్గరకు వెళ్లి ఓట్లడిగారు. 2014 లో మోడీ ప్రభంజనాన్నితట్టుకుని కన్నౌజ్ లో డింపుల్ గెలిచారు. కిందటిసారి ఎన్నికలతో పోలిస్తే ఎస్పీ పరిస్థితి బాగా మెరుగుపడిందన్నారు డింపుల్. బీఎస్పీ చీఫ్, రాష్ట్రీయలోక్ దళ్ అధినేత అజిత్ సిం గ్ కూడా తమతోకలిసి ఉండటంతో ఈసారి భారీ మెజారిటీతో గెలవడం ఖాయమన్న ధీమా వ్యక్తం చేస్తున్నారు.

ఇదిలా ఉంటే డింపుల్ గెలుపు నల్లేరు మీద నడక కాదంటున్నారు రాజకీయ పండితులు. కిందటి సారి పోటీ చేసిన సుబ్రత్ పాఠక్ ను బీజేపీ ఈసారికూడా బరిలోకి దింపింది . 2014 లో ఓడిపోయారన్న సానుభూతి పాఠక్ పై ఉందన్నారు స్థానిక బీజేపీ లీడర్లు. ఈ సానుభూతే పాఠక్ ను గెలుపు తీరాలకు చేరుస్తుందని చెప్పారు. ఇదిలా ఉంటే రాంపూర్ నుంచి బీజేపీ కేండిడేట్ గా పోటీ చేస్తున్న జయప్రదపై ఎస్పీ కేండిడేట్ ఆజం ఖాన్ చేసిన కామెంట్స్ వివాదంలో డింపుల్ తలదూర్చారు. జయప్రద పై ఆజం ఖాన్ చేసిన కామెం ట్స్ పై జాతీయ మహిళా కమిషన్ కూడా రియాక్టయింది. ఖాన్ కు నోటీసులు పంపించింది . అయితే ఆజం ఖాన్ కామెం ట్స్ వివాదాన్ని ‘ ఛోటీ సీ బాత్’ ( చిన్న విషయం)గా డింపుల్ కొట్టి పడేశారు.దీంతో చాలామంది ఆడవారిని ఆమె దూరం చేసుకున్నారన్నది రాజకీయ పండితుల అంచనా. ఏమైనా కన్నౌజ్ నియోజకవర్గం లో హోరాహోరీ పోరు ఉంది. డింపుల్ గెలిస్తే హ్యాట్రిక్ సాధించి రికార్డులకెక్కుతారు.

2012 లో లోక్ సభకు డింపుల్ ఎన్నిక

2009 లోక్ సభ ఎన్నికల్లో సమాజ్ వాది పార్టీ తరఫున అఖిలేశ్ యాదవ్ కన్నౌజ్ నుంచి పోటీచేసి 1,15,864 ఓట్ల మెజారిటీతో గెలిచారు.అయితే 2012 లో ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యారు. దీంతో కన్నౌజ్ ఎంపీ పదవికి రాజీనామా చేశారు. బై ఎలక్షన్ లో ప్రధాన పార్టీలన్నీ తమ కేండిడేట్లను నిలపకూడదని నిర్ణయించుకున్నాయి. అయితే చివరి నిమిషంలో బీజేపీ తమ కేండిడేట్ ను ప్రకటించినప్పటికీ, సమయం మించిపోవడంతో నామినేషన్ వేయలేకపోయారు.ఈ నేపథ్యంలో కన్నౌజ్ నుంచి డింపుల్ యాదవ్ ఏకగ్రీవంగా ఎన్నికై లోక్ సభలోకి అడుగుపెట్టారు. 2014 లో రెండోసారి కన్నైజ్ నుంచి పోటీ చేసి డిం పుల్ గెలిచారు. ఈ ఎన్నికల్లో యూపీ నుంచి మోడీ చరిష్మాను తట్టుకుని గెలిచిన ఐదుగురిలో డింపుల్ ఒకరు.

2009 లో రాజ్ బబ్బర్ చేతిలో ఓటమి

1999 లో అఖిలేశ్ యాదవ్ ను పెళ్లి చేసు-కున్న తర్వాత డిం పుల్ రాజకీయాలపైఆసక్తి పెం చుకున్నా రు. 2009 వరకుతెరవెనుకే ఉన్నా రు. భర్త అఖిలేశ్ ఎన్నికలప్రచారాలకే పరిమితమయ్యారు. 2009 లోతొలిసారిగా ఆమె లోక్ సభ బరిలో నిలిచారు. ఫి-రోజాబాద్ నియోజకవర్గం నుం చి ఎస్పీ టికెట్ పైపోటీ చేసి కాం గ్రెస్ కేం డిడేట్, సినీ నటుడు రాజ్బబ్బర్ చేతిలో ఓడిపోయారు. అయినా మామ,భర్త ఇచ్చిన ప్రోత్సాహంతో రాజకీయాల్లో కొనసాగుతున్నారు.

ఈ నెల 29న కన్నౌజ్ పోలింగ్

కన్నౌజ్ లోక్ సభ సెగ్మెంట్ లో మొత్తం ఐదు అసెంబ్లీ సెగ్మెంట్లున్నా యి. వీటిలో నాలుగు సెగ్మెంట్లకు బీజేపీ, ఒక సెగ్మెంట్ కు సమాజ్ వాది పార్టీ ప్రాతినిథ్యం వహిస్తున్నాయి. లోక్ సభ లోకన్నౌజ్ సెగ్మెంట్ కు అనేక మంది ప్రముఖులు ప్రాతినిథ్యం వహిం చారు. సోషలిస్టు సిద్ధాంతవేత్త  రాం మనోహర్ లోహియా, యూపీ మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్, ఎస్పీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ ఇక్కడ నుంచి గెలిచారు. ములాయం కుటుంబానికి ఈ నియోజకవర్గం తో ప్రత్యేకఅనుబంధం ఉంది.

ఎవరీమె..?

ములాయం సింగ్ కోడలిగా, అఖిలేష్ యాదవ్ భార్యగా మాత్రమే డింపుల్ ను చూడ్డానికి వీల్లేదు. యూపీ పాలిటిక్స్ లో  ఆమెకంటూ సొంత ముద్ర ఉంది. తండ్రి  సైన్యంలో పనిచేయడంతో డింపుల్ బాల్యం పూణే, భటిండా,అండమాన్  నికోబార్ దీవులు, లక్నోలో గడిచింది. బీ కాం చదువుకున్న డింపుల్ 1999లో అఖిలేశ్ ను పెళ్లి చేసుకున్నారు. యూపీ పాలిటిక్స్ లో పాపులరయ్యా రు.ఎన్నికల  ప్రచారాల్లో ఆకట్టుకునేలా  ప్రసంగాలు చేయడం మొదలెట్టారు. మంచి వాగ్దాటి గల యువ నేతగా రాష్ట్రస్థాయిలో పేరు తెచ్చుకున్నారు.

రెండో సారీ పాత ప్రత్యర్థే

2014 లోక్ సభ ఎన్నికల్లో  కన్నౌజ్ నుం చి డింపుల్ పై బీజేపీ తరఫున సుబ్రతా పాఠక్ పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో 19,907 ఓట్ల మెజారిటీతో డింపుల్ గెలిచారు. ఈసారి కూడా పాత ప్రత్యర్థులే తలపడుతున్నారు. ఇక్కడ మరో విశేషం ఏమిటంటే, 2009 ఎన్నికల్లో  కూడా అఖిలేశ్ పై  పోటీ చేసింది సుబ్రతా పాఠకే.