అఖిలేష్ యాదవ్ కు మరో షాక్

ఉత్తరప్రదేశ్ లో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ కు ఇంటిపోరు తప్పడం లేదు. మాజీ సీఎం ములాయం సింగ్ యాదవ్ చిన్న కొడలు అపర్ణయాదవ్ ఎస్పీకి ఇచ్చిన షాక్ నుంచి తెరుకోక ముందే ఆ పార్టీకి మరో షాక్ తగిలింది. తాజాగా ములాయం సింగ్ యాదవ్ బావ, అఖిలేశ్ యాదవ్ మామ ప్రమోద్ కుమార్ గుప్తా కమలం కండువా కప్పుకున్నారు. కాషాయ పార్టీలో చేరుతూనే అఖిలేష్ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ తీవ్ర విమర్శలు చేశారు. ఎస్పీ పార్టీలో కష్టపడి పనిచేసిన వారికి తగిన గుర్తింపు లేదన్నారు. ములాయం సింగ్ యాదవ్ ను అఖిలేష్ జైలులో పెట్టారని..పార్టీలో ఆయన పరిస్థితి చాలా దారుణంగా ఉందని ఆరోపించారు. క్రిమినల్స్, జూదగాళ్లను సమాజ్ వాదీ పార్టీలో  చేర్చుకున్నారని చెప్పారు. ములాయం సింగ్ కుటుంబం స‌భ్యులు వ‌రుస‌గా బీజేపీ గూటికి క్యూక‌ట్ట‌డం రాజ‌కీయ వ‌ర్గాల్లో తీవ్ర చ‌ర్చ‌నీయాంశ‌ంగా మారింది.

మరిన్ని వార్తల కోసం

బాలుడిని కిడ్నాప్ చేసిన చైనా ఆర్మీ

పొగమంచుతో ఢిల్లీలో పలు రైళ్లు రద్దు