SA vs PAK: సౌతాఫ్రికా బౌలర్ అత్యుత్సాహం.. బంతిని బాబర్ కాళ్లకు విసిరి కొట్టిన మల్డర్

SA vs PAK: సౌతాఫ్రికా బౌలర్ అత్యుత్సాహం.. బంతిని బాబర్ కాళ్లకు విసిరి కొట్టిన మల్డర్

సౌతాఫ్రికాపై పాకిస్థాన్ కేప్ టౌన్ వేదికగా రెండో టెస్టు ఆడుతోంది. మూడో రోజు ఆటలో భాగంగా సౌతాఫ్రికా బౌలర్ మల్డర్ చేసిన ఓవరాక్షన్ కు పాకిస్థాన్ బ్యాటర్ బాబర్ ఆజాంకు పెను ప్రమాదం తప్పింది. రెండో ఇన్నింగ్స్ లో సౌతాఫ్రికా ఫాలో ఆన్ కు బ్యాటింగ్ కు వచ్చింది. తొలి ఇన్నింగ్స్ లో విఫలమైనా రెండో ఇన్నింగ్స్ లో అద్భుతంగా బ్యాటింగ్ చేసింది. తొలి వికెట్ కు కెప్టెన్ షాన్ మసూద్, బాబర్ అజామ్ 100 కు పైగా భాగస్వామ్యాన్ని నెలకొల్పి జట్టును ఆదుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ సమయంలో సౌతాఫ్రికా బౌలర్ మల్డర్ తన సహనాన్ని కోల్పోయాడు. 

మల్డర్ తన మూడో ఓవర్ నాలుగో బంతిని బాబర్ స్త్రైట్ డ్రైవ్ ఆడాడు. ఈ బంతిని అందుకున్న మల్డర్.. కోపంతో ఓవర్ త్రో బాబర్ వైపు విసిరాడు. అది కాస్త బాబర్ షూస్ కు బలంగా తగిలింది. దీంతో కోపంగా బాబర్ మల్డర్ వైపు చూశాడు. ఈ సౌతాఫ్రికా బౌలర్ మల్డర్ కు ఏదో చెబుతూ సారీ అని చెప్పాడు. ఇంతలో నాన్ స్ట్రైకింగ్ లో ఉన్న షాన్ మసూద్ అంపైర్ కు ఫిర్యాదు చేశాడు. అంపైర్ మాట్లాడి వాళ్లకు సర్ది  చెప్పాడు.   

Also Read  : సఫారీ టీమ్‌‌కు 421 రన్స్ ఆధిక్యం

ఈ టెస్ట్ మ్యాచ్ విషయానికి వస్తే రెండో ఇన్నింగ్స్ లో పాకిస్థాన్ పోరాడుతుంది. ఫాలో ఆన్ ఆడుతూ మూడో రోజు ఆట ముగిసేసరికి వికెట్ నష్టానికి 213 పరుగులు చేసింది. క్రీజ్ లో సెంచరీ హీరో షాన్ మసూద్ (112), నైట్ వాచ్ మెన్ షెహజాద్ (2) ఉన్నారు. 81 పరుగులు చేసి బాబర్ అజామ్ రాణించాడు. ప్రస్తుతం పాకిస్థాన్ రెండో ఇన్నింగ్స్ లో మరో 208 పరుగులు వెనకబడి ఉంది. తొలి ఇన్నింగ్స్ లో సౌతాఫ్రికా 615 పరుగులు చేస్తే.. పాకిస్థాన్ 194 పరుగులకే ఆలౌటైంది.