
హైదరాబాద్: తెలంగాణ ప్రీమియర్ లీగ్(టీపీఎల్) నిర్వహణకు సహకారం అందించాలని ఎస్‌ఆర్‌హెచ్‌జట్టు యాజమాన్యాన్ని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) అధ్యక్షుడు అర్శనపల్లి జగన్‌మోహన్ రావు కోరారు. ఉప్పల్‌లో మల్టీలెవల్ పార్కింగ్ నిర్మాణానికి సహకరించాలని విజ్ణప్తి చేశారు. బుధవారం(ఫిబ్రవరి 19) ఉప్పల్ స్టేడియంలో ఎస్‌ఆర్‌హెచ్ జట్టు యాజమాన్యంతో జరిగిన సమన్వయ సమావేశంలో పాల్గొన్నారు జగన్‌మోహన్ రావు.
టీపీఎల్ నిర్వహణ, రాష్ట్రంలో క్రికెట్ అభివృద్ధి కార్యక్రమాలకు తమ వైపు నుంచి సంపూర్ణ సహకారమందిస్తామని ఎస్‌ఆర్‌హెచ్ ప్రతినిధులు హామీ ఇచ్చారు. అదేవిధంగా ఉప్పల్‌లో మల్టీలెవల్ పార్కింగ్ నిర్మాణంపై అంచనాలు రూపొందిస్తే వచ్చే ఏడాది పనులు ప్రారంభించేందుకు తమ వంతు సహాయం అందిస్తామని ఎస్‌ఆర్‌హెచ్ బృందం తెలిపింది.
Also Read : మేము ఏ జట్టునైనా ఓడించగలం
జగన్ మోహన్ రావు మాట్లాడుతూ.. ఇపీఎల్ టిక్కెట్ల విక్రయం పూర్తి పారదర్శకంగా జరగాలని, స్టేడియంలో స్నాక్స్, కూల్ డ్రింక్స్ సాధారణ రేట్లకే అమ్మాలని ఎస్‌ఆర్‌హెచ్ బృందానికి రావు సూచించారు. మార్చి 2న ఐపీఎల్ ఏర్పాట్లపై హెచ్‌సీఏ అపెక్స్ కౌన్సిల్ సభ్యులు,-ఎస్‌ఆర్‌హెచ్ బృందం సంయుక్తంగా స్టేడియం మొత్తాన్ని పరిశీలించనున్నామని తెలిపారు.
ఈ సమావేశంలో హెచ్ సీఏ ఉపాధ్యక్షుడు దల్జీత్ సింగ్, సంయుక్త కార్యదర్శి బసవరాజు, కోశాధికారి సీజే శ్రీనివాస్ , ఎస్‌ఆర్‌హెచ్ నుంచి సీఈఓ షణ్ముగం, డైరెక్టర్ కిరణ్, జీఎం శ్రీనాథ్ తదితరులు పాల్గొన్నారు.