కార్ల పార్కింగ్ సమస్యలకు చెక్.. కేబీఆర్పార్క్ వద్ద మల్టీలెవెల్ పార్కింగ్ సిస్టమ్

కేబీఆర్పార్క్ వద్ద మల్టీ లెవల్ పార్కింగ్ త్వరలో ఏర్పాటుకు చేయనున్నారు. దీనికోసం నవ నిర్మాణ్ అసోసియేట్స్ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) స్టాండింగ్ కమిటీ ఆమోదం తెలిపింది. జూబ్లీహిల్స్‌లోని KBR పార్క్‌ వద్ద పార్కింగ్ సౌకర్యం కల్పించాలని ప్రజలనుండి వస్తున్న డిమాండ్ తో మల్టీ లెవెల్ పార్కింగ్ ఏర్పాటు చేసేందుకు జీహెచ్ ఎంసీ సిద్ధమవుతోంది.  

మల్టీ-లెవల్ పార్కింగ్‌లో సౌకర్యాలు

పార్కింగ్ సదుపాయం 405 చదరపు మీటర్లలో ఏర్పాటు చేస్తున్నారు. 72 కార్లను పార్కింగ్ చేసేందుకు కార్ స్పేస్‌లను (ECS) కలిగి ఉంటుంది. KBR పార్క్‌లోని మల్టీ-లెవల్ పార్కింగ్ సదుపాయంలో మొత్తం ఖాళీలలో 20 శాతం బైకులను కేటాయించనున్నారు. ఈ సదుపాయం డిజైన్, బిల్డ్, ఫైనాన్స్, ఆపరేట్ , ట్రాన్స్‌ఫర్ (DBFOT) మోడల్‌లో నిర్మించబడుతుంది.

ఫెసిలిటీ వద్ద టిక్కెట్లు

ఈ సదుపాయం ఉదయం 5 గంటల నుండి రాత్రి 11 గంటల వరకు ప్రజలకు అందుబాటులో ఉంటుంది. పార్కింగ్  కోసం టికెట్టు ఉంటుంది.మెషీన్ల ద్వారా టికెట్లు ఇవ్వనున్నారు. స్మార్ట్ కార్డుల ద్వారా కూడా టికెట్ పంపిణీ ఉంటుంది. పార్కింగ్ సదుపాయాన్ని నావిగేట్ చేయడానికి, పార్కింగ్‌ను ముందుగానే బుక్ చేసుకోవడానికి, ఇతర సేవలను కోసం కస్టమర్లకు సహాయపడేందుకు మొబైల్ యాప్ ద్వారా అందించనున్నారు. 

KBR పార్క్‌లో పార్కింగ్‌తో ఇబ్బందులు పడుతున్న హైదరాబాద్ వాసులకు కొత్త సౌకర్యం ఉపశమనం కలిగించే అవకాశం ఉంది.