సెంట్రల్ జైల్ స్థలంలో నిర్మిస్తున్న మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి భవన నిర్మాణం12 నెలల్లోగా పూర్తవుతుందని మంత్రి హరీష్ రావు అన్నారు. వరంగల్ లో సెంట్రల్ జైల్ స్థలంలో కడుతున్న 24 అంతస్థుల మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి భవన నిర్మాణలను మంత్రులు హరీష్ రావు, ఎర్రబెల్లి దయాకరరావు, సత్యవతి రాథోడ్ పరిశీలించారు. వరంగల్ లో అతి త్వరలో అత్యాధునిక వైద్యసేవలు అందుబాటులోకి రానున్నాయని హరీష్ రావు స్పష్టం చేశారు. ఇప్పటికే హెలీ అంబులెన్స్ సేవల కోసం అనుమతులు లభించాయని హరీష్ రావు తెలిపారు. ప్రస్తుతం 750 మంది కార్మికులతో సాగుతున్న పనులు సాగుతుండగా... 2500 మందితో చేపట్టి పనులు వేగవంతం చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ లోపు స్టాఫ్ రిక్రూట్మెంట్, పరికరాలు సమకూర్చే ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ఈ 24 అంతస్తుల భవనంలో 16 అంతస్థులు అత్యాధునిక వైద్య సేవలకు ... మిగిలిన 8 అంతస్తులు మెడికల్ ఎడ్యుకేషన్ ఉండేలా ఆస్పత్రి నిర్మాణం ఉండేలా ప్రణాళిక చేశామని తెలిపారు.