ఒకదానినొకటి ఢీకొన్న వెహికల్స్.. 32 మంది మృతి

ఒకదానినొకటి ఢీకొన్న వెహికల్స్.. 32 మంది మృతి

ఒకదానినొకటి ఢీకొన్న వెహికల్స్..
32 మంది మృతి, 63 మందికి గాయాలు.. 
ఈజిప్ట్​లో ఘోరం

కైరో: ఈజిప్ట్​లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. పొగమంచు కారణంగా హైవేపై వెహికల్స్​ ఒకదానినొకటి ఢీకొన్నాయి. దీంతో వాహనాల్లో మంటలు చెలరేగి 32 మంది మృతి చెందారు. మరో 63 మందికి గాయాలయ్యాయి. ఈజిప్ట్​ రాజధాని కైరో నుంచి అలెగ్జాండ్రియాను కలిపే హైవేపై.. నుబారియా టౌన్​లో స్థానిక కాలమానం ప్రకారం శనివారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. ఓ బస్సు కైరో వైపు వెళ్తూ.. ఆగి ఉన్న వాహనాన్ని ఢీకొట్టడంతో మంటలు చెలరేగినట్టు స్థానిక మీడియా తెలిపింది. 

ఆ తర్వాత ఆ మంటల్లోకి సుమారు 29 వెహికల్స్​ దూసుకెళ్లినట్టు వెల్లడించింది. సమాచారం అందుకున్న ఫైర్​ సిబ్బంది స్పాట్​కు చేరుకొని మంటలు ఆర్పారు. అప్పటికే చాలా వెహికల్స్​ మంటల్లో కాలిపోయాయి. వాహనాల్లోనే కొంతమంది సజీవ దహనమయ్యారు. కాగా, హైవేలపై భారీగా పొగమంచు ఉంటుందని ఈజిప్టు వాతావరణ అథారిటీ ఒక రోజు ముందే హెచ్చరించినట్టు తెలిపింది.