8వ మల్టీ జోనల్‌‌ లెవల్‌‌ స్పోర్ట్స్‌‌ మీట్ ప్రారంభం

8వ మల్టీ జోనల్‌‌ లెవల్‌‌ స్పోర్ట్స్‌‌ మీట్ ప్రారంభం

గోపాల్ పేట, మరికల్‌‌, లింగాల, వెలుగు:  సోషల్ వెల్ఫేర్‌‌‌‌ స్కూళ్లకు సంబంధించిన 8వ మల్టీ జోనల్‌‌ లెవల్‌‌ స్పోర్ట్స్‌‌ మీట్ ప్రారంభం అయ్యింది. ఆదివారం వనపర్తి జిల్లా గోపాల్‌‌పేట మండలం బుద్దారం, నాగర్‌‌‌‌ కర్నూల్ జిల్లా లింగాల, నారాయణపేట జిల్లా మరికల్‌‌ గురుకులాల్లో  అండర్- 14,   -17, -19 స్థాయిలో వాలీబాల్, కబడ్డీ, ఖోఖో, అథ్లెటిక్స్ విభాగాలకు సంబంధించిన పోటీలు ప్రారంభం అయ్యాయి. బుద్దారంలో చీఫ్‌‌ గెస్టుగా హాజరైన వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ ఎలాంటి వసతులు లేని రోజుల్లోనే అంబేద్కర్‌‌ విదేశాలకు వెళ్లి ఉన్నత చదువులు చదివారని గుర్తు చేశారు.

ప్రస్తుతం ప్రభుత్వం అన్ని సౌకర్యాలు కల్పిస్తోందని, వినియోగించుకొని ఉన్నత స్థానాలకు చేరాలని ఆకాంక్షించారు.   ఆటల్లో గెలవడం ముఖ్యం కాదని,  పాల్గొనడమే ముఖ్యమని చెప్పారు.  గోపాల్‌‌ పేటలో కలెక్టర్ షేక్ యాస్మిన్ భాషా, జడ్పీ చైర్మన్ లోక్ నాథ్ రెడ్డి,  ఎంపీపీ సంద్య యాదవ్, జడ్పీటీసీ భార్గవి,   మరికల్‌‌లో పేట అడిషనల్​కలెక్టర్​ పద్మజరాణి, సోషల్​ వెల్ఫేర్​ జేడీ శారద , ఆర్సీవో ప్లారెన్స్​రాణి, జడ్పీ వైస్​ చైర్​పర్సన్​ సురేఖరెడ్డి, ఎంపీపీ శ్రీకళ, సర్పంచి కె.గోవర్దన్​, ఎంపీటీసీలు సుజాత, గోపాల్​, ప్రిన్సిపాల్​ అనురాధ, లింగాలలో డీసీవో  దానం, ప్రిన్సిపాల్ వినోద్ ఖన్నా, వైస్ ప్రిన్సిపాల్ బాలస్వామి, పీడీ వెంకటేశ్వర్లు,  సర్పంచ్ కోనేటి తిరుపతయ్య పాల్గొన్నారు.