- ఐజీ ఏవీ రంగనాథ్ ఉత్తర్వులు జారీ
హైదరాబాద్, వెలుగు: డ్యూటీలో నిర్లక్ష్యం వహించిన ఆరుగురు పోలీసు అధికారులను మల్టీ జోన్1 ఐజీ ఏవీ రంగనాథ్ సస్పెండ్ చేశారు. ఇద్దరు ఇన్‌స్పెక్టర్లు, ఇద్దరు ఎస్‌ఐలు, హెడ్ కానిస్టేబుల్, కానిస్టేబుల్‌ను సస్పెండ్ చేస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.
ప్రజా భవన్ వద్ద రోడ్డు ప్రమాదానికి కారణమైన మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు రాహెల్‌ను కేసు నుంచి తప్పించేందుకు బోధన్ ఇన్‌స్పెక్టర్ బీడీ ప్రేమ్ కుమార్‌ను, పోలీస్ స్టేషన్‌లో మద్యం సేవించిన నిజామాబాద్ జిల్లా సీసీఎస్ ఇన్‌స్పెక్టర్ రమేశ్‌ను సస్పెండ్ చేసినట్లు తెలిపారు. గంజాయి కేసులో నిర్లక్ష్యం వహించినందుకు జగిత్యాల జిల్లా సారంగాపూర్ ఎస్ఐలు మనోహర్ రావు, తిరుపతి, హెడ్ కానిస్టేబుల్ రవీందర్ రెడ్డి, కానిస్టేబుల్ నరేందర్‌ను సస్పెండ్ చేసినట్లు ప్రకటించారు.