
తక్కువ టైమ్ లో ఎక్కువ ప్రాఫిట్స్ కోసం చాలా మంది స్టాక్ మార్కెట్ ను ఒక ఆప్షన్ గా చూస్తుంటారు. అయితే కొన్ని సార్లు సక్సెస్ కావచ్చు.. కొన్ని సార్లు లాస్ అవ్వచ్చు. అలాంటి మల్టీ బ్యాగర్ స్టాక్స్ పట్టుకోవడం మాత్రం సవాల్ తో కూడున్నదే. ఎదుకంటే కొన్నిసార్లు ఎంతో ఊహించి ప్లాన్ చేసి ఇన్వెస్ట్ చేసిన కంపెనీ.. అనుకున్నట్లుగా పెరగకపోవచ్చు. కానీ ఈ కంపెనీ మాత్రం కేవలం రెండేళ్లలో ఊహించని బంపర్ ప్రాఫిట్స్ ను ఇచ్చింది. కేవలం రెండేళ్లలో పది వేలను దాదాపు రూ.6 లక్షలకు పెంచేసింది.
ఇంత మార్కెట్ ఫాల్ లో కూడా ఈ స్టాక్ 5 శాతం అప్పర్ సర్క్యూట్ కొట్టి మార్కెట్ లో బజ్ క్రియేట్ చేసింది. ఆ కంపెనీ పేరు వంటేజ్ కాలెడ్జ్ అకాడెమీ ( Vantage Knowledge Academy). గత మూడు ట్రేడింగ్ సెషన్స్ లో ఈ స్టాక్ బ్యాక్ టు బ్యాక్ అప్పర్ సర్యూట్ కొడుతోంది.
ఈ స్టాక్ బీఎస్ఈ లో శుక్రవారం (ఫిబ్రవరి28) రూ.110.40 దగ్గర క్లోజ్ అయ్యింది. గత ఆరు నెలలో 67 శాతం పెరగగా, లాస్ట్ ఇయర్ నుంచి ఇప్పటి వరకు 520 శాతం రిటర్న్స ఇచ్చింది. 2023లో రూ.1.88 దగ్గర ఉన్న స్టాక్ ఈ రెండేళ్లలో 5772% పెరిగి సూపర్ మల్టీ బ్యాగర్ రిటర్న్స్ ఇచ్చింది. అంటే 2023లో రూ.10 వేలు ఇన్వెస్ట్ చేసి ఉంటే ఇప్పుడు ఆ విలువ 5 లక్షల 87 వేల రూపాయలు అయ్యేది.
బోనస్ షేర్లు:
ఈ కంపెనీ త్వరలోనే బోనస్ షేర్లు ఇచ్చేందుకు సిద్ధమైంది. 2:1 రేషియోలో బోనస్ ఇవ్వనున్నట్లు ప్రకటించింది. అంటే ఒక షేర్ కు రెండు షేర్లు బోనస్ గా ఇవ్వనున్నారు. రికార్డ్ డేట్ మార్చి 5 గా నిర్ణయించారు. అంటే మార్చి 5 తేదీ ఎవరికి అకౌంట్లో అయితే షేర్లు ఉంటాయో వారికి బోనస్ షేర్లు ఇవ్వనున్నారు.
కంపెనీ గురించి:
ఈ కంపెనీ కేవలం రూ.1257 కోట్ల చిన్న కంపెనీ. ఫైనాన్స్, బ్యాంకింగ్ లో ఇన్స్టిట్యూషన్స్ నడిపిస్తోంది. చాలా హై వాల్యుయేషన్ లో ఉంది. అంటే ఇండస్ట్రీ P/E 37 ఉంటే ఈ స్టాక్ పీఈ 648 గా ఉంది. అంటే చాలా ఎక్కువ పీఈ లో ఉంది. గత రెండు మూడు క్వార్టర్స్ నుంచి ప్రాఫిట్ మేకింగ్ కంపెనీగా మారింది. అంతకు ముదు నష్టాల్లోనే ఉంది. కాబట్టి.. ఇప్పటి వరకు మల్టీ బ్యాగర్ రిటర్న్స్ ఇచ్చిందని, ఇకనుంచి కూడా ఇస్తుందనీ ఇన్వెస్ట్ చేయడం సరికాదు. కంపెనీ గురించి పూర్తిగా తెలుసుకుని నిర్ణయం తీసుకోగలరు. కంపెనీ బిజినెస్ గురించి అవగాహన లేకుండా, కంపెనీ ఫైనాన్షియల్స్ గురించి తెలియకుండా డెసిషన్ తీసుకోకూడదు. మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ ను సంప్రదించి నిర్ణయం తీసుకోగలరు.