హైదరాబాద్, వెలుగు: మల్టీబ్రాండ్ రిటైల్ చైన్ సెల్‌బే రంగారెడ్డి జిల్లాలోని ఆమనగల్ పట్టణంలో తన కొత్త షోరూమ్‌ను శుక్రవారం ప్రారంభించింది. ఇక్కడ మొబైల్ హ్యాండ్‌సెట్‌లు, యాక్సెసరీలు, స్మార్ట్ వాచ్‌లు, స్మార్ట్ టీవీలు, ల్యాప్‌టాప్‌లు, వ్యక్తిగత సంరక్షణ ఉత్పత్తులను అమ్ముతారు. ఈ సందర్భంగా సంస్థ పలు ఆఫర్లను ప్రకటించింది. బ్రాండెడ్ నెక్‌బ్యాండ్ కేవలం రూ. 99లకు సొంతం చేసుకోవచ్చు.
మొదటి 1000 కస్టమర్లకు ఆండ్రాయిడ్ టీవీని రూ.ఎనిమిది వేలకు ఇస్తారు. కొన్ని బ్రాండెడ్ టీవీ లతో సౌండ్ బార్‌ను ఉచితంగా ఇస్తారు. కేవలం రూ.ఆరు వేలకు అండ్రాయిడ్ఫోన్ను కొనుక్కోవచ్చు.