నేపాల్ రాజధాని ఖాట్మండులో గత మూడు రోజుల నుంచి కురుస్తున్న వర్షాలు వరద బీభత్సాన్ని సృష్టిస్తున్నాయి. భారీ వరదల కారణంగా కొండచరియలు విరిగిపడిన పడుతున్నాయి. రోడ్లపై ప్రయాణించే బస్సులు, ఇతర వాహనాల ప్రమాదాలకు గురైయ్యాయి. రెస్య్కూ టీం డజన్ల కొద్దీ మృతదేహాలను స్వాధీనం చేసుకుంటున్నారు. వరదల కారణంగా మరణించిన వారి సంఖ్య కనీసం 148కి పెరిగింది. పదుల సంఖ్యలో జనాలు వరద జలాల్లో గల్లంతు అయినట్లు అధికారులు తెలిపారు. ఖాట్మండుకు వెళుతున్న రెండు బస్సుల నుంచి 14 మృతదేహాలను శనివారం రాత్రి వెలికితీశారు.
ALSO READ | ఇజ్రాయెల్ ఎయిర్ స్ట్రైక్‌లో మరో హిజ్బుల్లా నాయకుడు హతం
ఖాట్మండు నుంచి 16 కిలోమీటర్ల దూరంలో ఉన్న అదే స్థలంలో ఆదివారం మరో 23 మృతదేహాలను బయటకు తీశారు సహాయక బృందాలు. ఇంకా గల్లంతు అయిన వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఖాట్మండులోని మూడు హైవేలుపై ఆదివారం కొండచరియలు విరిగిపడ్డాయి. భారీ వరదల్లో పలు వంతెనలు కొట్టుకుపోయాయి. నేపాల్‌లోని భయానక పరిస్థితుల వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అనేక బ్రిడ్జ్ లు కూలి పోయి వరద ఉదృతిలో కొట్టుకుపోతున్నాయి.