ఆస్ట్రేలియాలో షాపింగ్ మాల్ పై టెర్రరిస్టుల దాడి.. ఐదుగురి మృతి

ఆస్ట్రేలియా రాజధాని సడ్నీలోని ఓ షాపింగ్ మాల్ లో ఓ అఘంతకుడు రెచ్చిపోయాడు. విచక్షణా రహితంగా తొమ్మిది మందిపై దాడి చేశాడు. ఈ దాడిలో ఐదుగురు మృతి చెందగా మిగతావారు గాయపడ్డారు. బోండి జంక్షన్‌లోని వెస్ట్‌ఫీల్డ్ మాల్‌లో  ఉన్నట్టుండి ఓ వ్యక్తి మాల్ ఉన్నవారిపై కాల్పులు చేస్తూ.. కత్తితో దాడి చేశాడు. దీంతో షాపింగ్ మాల్ లోని జనం అంతా భయంతో భయటకు పరుగులు పెట్టారు. 

గాయపడిన వారిలో ఒక చిన్నారి కూడా ఉంది. పోలీసులు అక్కడికి చేరుకొని దాడి చేసిన వ్యక్తిని ఎన్ కౌంటర్ చేశారు. పోలీసులు ఆ వ్యక్తి ఎవరని వివరాలు సేకరిస్తున్నారు. గాయపడిన వారిని హాస్పిటల్ కు తరలించారు. పోలీసులు దాడికి గల కారణాలను ఆరా తీస్తున్నారు.