Lok Sabha Elections 2024: థియేటర్లలో ఎన్నికల ఫలితాలు ప్రత్యక్ష ప్రసారం..ఫుల్ డిటెయిల్స్

Lok Sabha Elections 2024: థియేటర్లలో ఎన్నికల ఫలితాలు ప్రత్యక్ష ప్రసారం..ఫుల్ డిటెయిల్స్

లోక్ సభ ఎన్నికల పోలింగ్ శనివారం (జూన్1)  ముగిసింది. దేశవ్యాప్తంగా ఏడు విడుతలుగా పోలింగ్ నిర్వహించారు. జూన్ 4 ఓట్ల లెక్కింపు నిర్వహించనున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సారి సార్వత్రిక ఎన్నికల ఫలితాలకోసం ప్రజలను ఆసక్తిగా  ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో ఎన్నికల ఫలితాల క్రేజ్ ను క్యాష్ చేసుకునేందుకు సినిమా థియేటర్ల యజమానులు ప్లాన్ చేస్తున్నారు. ఎన్నికల ఫలితాలను బిగ్ స్క్రీన్లపై చూపించి సొమ్ము చేసుకునేందుకు సిద్ధమవుతున్నారు.

ముంబైలోని పలు మల్టీ ప్లెక్స్, ఇతర థియేటర్ల యజమానులు టిక్కెట్లు పెట్టి ఎన్నికల ఫలతాలను చూపించేందుకు అన్ని ఏర్పాటు చేసుకుంటున్నారు. ముంబైలోని ఎస్ ఎం 5 కళ్యాణ్, సియాన్, మూవీ మ్యాక్స్ , వండర్ మాల్, ఎటర్నిటి మాల్, మూవీమ్యాక్స్ ఎటర్నిటీ, పుణేలోని మూవీమ్యాక్స్, మీరా రోడ్ లోని మూవీ మ్యాక్స్ చైన్ ఆఫ్ థియేటర్లలో ఎన్నికల ఫలితాలను ప్రత్యక్ష ప్రసారం చేసేందుకు సిద్దమయ్యాయి.  టిక్కెట్ ధర రూ. 99 నుంచి రూ. 300 వరకు ఉంటుందని తెలుస్తోంది. 

 ఎన్నికల ఫలితాలు 2024 పేరుతో షో ఏర్పాటు చేస్తున్నారు. ఆరు గంటల నిడివి గల షో కోసం Paytmలో బుకింగ్‌లు ఇప్పుడు ఆన్‌లైన్‌లో తెరిచారు. శనివారం ఉదయం 9 గంటలకు ప్రారంభమయ్యాయి. జూన్ 4 అన్ని మల్టీ ప్లెక్స్ రైన్ మూవీ మ్యాక్స్ థియేటర్లలో  ఎన్నికల ఫలితాలు ప్రత్యక్ష ప్రసారం చేస్తారు. 

ఐడియా ఎలా వచ్చిందంటే.. 

ఇటీవల అయోధ్యలో రామమందిరం ప్రారంభోత్సవం సందర్భంగా ఈ ట్రెండ్ ను అమలులోకి తీసుకొచ్చింది మల్టీప్లెక్స్ చైన్ మూవీ మ్యాక్స్. ప్రేక్షకుల నుంచి మంచి స్పందన రావడంతో ఎన్నికల ఫలితాలను కూడా ప్రత్యక్ష ప్రసారం చేస్తే ఎలా ఉంటుందనే ఆలోచన చేశారు థియేటర్ల యజమానులు. ఇంతకుముందు టీ 20 టోర్నీని కూడా ప్రదర్శించారు. ఎంటర్ టైన్ మెంట్ కోసం సరౌండ్ సిస్టమ్, బిగ్ స్క్రీన్, ఫుడ్ ఆప్షన్లను అందిస్తున్నారు.

మహారాష్ట్రతోపాటు ఇతర రాష్ట్రాల్లో కూడా ప్రత్యక్ష ప్రసారాలకు అనుమతి పొందేందుకు థియేటర్ యజమానులు చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. శుక్రవారం మధ్యాహ్నం ఎన్నికల ఫలితాల స్క్రీనింగ్ కోసం బుకింగ్‌లు తెరిచారు. ఎన్నికల ఫలితాల స్క్రీనింగ్ కోసం టిక్కెట్లు విపరీతంగా అమ్ముడయినట్లు సమాచారం.