బిల్ట్ భూముల సర్వే వేగవంతం చేయాలి : కలెక్టర్ మహేందర్ జీ

మంగపేట, వెలుగు : ములుగు జిల్లా మంగపేట మండలం కమలాపురంలోని బిల్ట్ ఫ్యాక్టరీకి సంబంధించిన భూమిని శుక్రవారం ములుగు అడిషనల్ కలెక్టర్ మహేందర్ జీ పరిశీలించారు. బిల్ట్ ల్యాండ్ కు సంబంధించిన రికార్డులను పరిశీలించారు. రికార్డు ప్రకారం భూమిని త్వరగా సర్వే చేయాలని

బిల్ట్ నూతన యాజమాన్యం ఫిన్ క్విస్ట్ కు అప్పగించాలన్నారు. బిల్ట్ భూమిలో కబ్జాలో ఉన్న వారికి నోటీసులు జారీ చేయాలని, తహసీల్దార్​ వీరస్వామికి సూచించారు. ఆయనవెంట ఆర్ఐ బందారపు శ్రీనివాస్, డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ రాజనర్సయ్య తదితరులున్నారు.