పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనాలు

పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనాలు

ములుగు, వెలుగు : ములుగు మల్లంపల్లి మండల కేంద్రాల్లో ఆదివారం పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనాలు జరిగాయి.  మల్లంపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 1997–.98 ఎస్ఎస్సీ బ్యాచ్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం పాఠశాల ఆవరణలో జరిగింది. పూర్వ హెడ్మాస్టర్ గోపాల్ రెడ్డి, ఉషారాణి, మాజీ డీసీఈబీ సెక్రటరీ విజయమ్మ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.  ఈ సందర్భంగా వారికి సన్మానం చేశారు.  మల్లంపల్లిలోని శ్రీ సిద్ధార్థ ఉన్నత పాఠశాలలో 2000 –-2001 బ్యాచ్ పదో తరగతి విద్యారులు వారికి చదువు నేర్పిన ఉపాధ్యాయులను ఆహ్వానించి సన్మానించారు.  

ప్రధానోధ్యాయుడు రాజేందర్, కరెస్పాండెంట్ రవి, ఉపాధ్యాయులు జ్యోతి, జానీ, భిక్షపతి, నారాయణ మాట్లాడుతూ..  విద్యార్థుల బాగు కోసమే ఉపాధ్యాయులు నిరంతరం కృషి చేస్తారన్నారు.  ములుగులోని ఆదర్శ బాలవిహార్ ఉన్నత పాఠశాల 2007 –- 2008 బ్యాచ్ పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఘనంగా జరిగింది.  గురువులైన ప్రధానోపాధ్యాయుడు  సూర్యదేవర ఆనందం-రాణి, విశ్వనాథ్ దంపతులు, విద్యాబుద్ధులు బోధించిన ఉపాధ్యాయులు అందరినీ ఘనంగా సన్మానించారు. పూర్వ విద్యార్థులు శిల్ప,  స్రవంతి, శీలమంతుల తేజేశ్వర్, కొత్త సురేందర్,  ఇమ్మడి రాకేశ్, విజయ్, భరత్, చల్లా రాము, ఎస్కె మంజూరు పాషా, ఖయ్యూం, ప్రభాకర్, శివకుమార్,  ఇమ్రాన్, అనిల్,  కిరీట్, తదితరులు పాల్గొన్నారు.