
- ముందుగా పూర్తిస్థాయి
- ఇన్ఫ్రాస్ట్రక్చర్పై దృష్టి సారిస్తున్నాం
ములుగు, వెలుగు : సమ్మక్క, సారలమ్మ జాతీయ గిరిజన విశ్వవిద్యాలయంలో వచ్చే ఏడాది నుంచి విద్యార్థులకు కొత్త కోర్సులను అందుబాటులోకి తీసుకొస్తామని వీసీ వైస్వైఎల్ శ్రీనివాస్పేర్కొన్నారు. ముందుగా వర్సిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్పై దృష్టి సారించామని తెలిపారు. సెంట్రల్పబ్లిక్వర్క్స్డిపార్ట్మెంట్ వరంగల్ప్రతినిధి మనీష్‌వర్మ టీమ్ శుక్రవారం వర్సిటీ స్థలాన్ని పరిశీలించింది.
ఏం పనులు చేయాలి, ప్లానింగ్ ఏంటి, భూమి విస్తీర్ణం వంటి అంశాలపై చర్చించారు. అనంతరం ములుగు మండలం జాకారంలోని వర్సిటీ తాత్కాలిక భవనం వైటీసీలో నోడల్ ఆఫీసర్వంశీతో కలిసి వీసీ మీడియాకు వివరాలు తెలిపారు. వర్సిటీకి ప్రభుత్వం 287ఎకరాల భూమి కేటాయించిందని, అందులో 50ఎకరాలు అటవీ భూమి ఉందని పేర్కొన్నారు. తొలుత క్యాంపస్ల్యాండ్చుట్టూ కాంపౌండ్వాల్నిర్మించేందుకు రూ.24కోట్ల ప్రతిపాదనలు సిద్ధం చేశామన్నారు.
10 రోజుల్లో టెండర్‌వేసి ప్రక్రియ పూర్తి చేస్తామన్నారు. క్యాంపస్ పరిధిలో నల్లరేగడి, కొండ, మొరం మట్టి స్వభావం ఉందని, టోపోగ్రాఫికల్ సర్వే చేయిస్తామని వెల్లడించారు. ప్రస్తుతం బీఏ హానర్స్ ఇంగ్లీష్, ఎకనామిక్స్ కోర్సులు నడుస్తున్నాయని, వచ్చే అకాడమిక్ నుంచి మెయిన్క్యాంపస్లో బయో టెక్నాలజీ, ఎంబీయే, ఇంజినీరింగ్ ప్రోగ్రాం వంటి జాబ్ ఓరియెంటెడ్కోర్సులను అందుబాటులోకి తెస్తామన్నారు. ములుగు ప్రాంత గిరిజన, ఆదివాసీలతో స్థితిగతులు, కల్చర్, లివింగ్, ఎకానమీ వంటి అంశాలపై రీసెర్చ్‌కు ట్రైబల్స్టడీ సెంటర్ ఏర్పాటు చేస్తామన్నారు.