ములుగు, వెలుగు: ఏటూరునాగారం ఎకో సెన్సిటివ్ జోన్ పరిధికి సంబంధించిన నివేదికలు ఈనెల 10వ తేదీలోపు సమర్పించాలని ములుగు కలెక్టర్ దివాకర అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్ లో డీఎఫ్ వో రాహుల్ కిషన్ జాదవ్ తో కలిసి ఏటూరునాగారానికి సంబంధించి ఎకో సెన్సిటివ్ జోన్ పరిధి నిర్ధారణ పై సంబంధిత అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వన్యప్రాణి విభాగానికి సంబంధించి జోన్ పరిధిని నిర్ధారించాలన్నారు. సమావేశంలో ఎఫ్డీవో వజ్రారెడ్డి, ఆర్అండ్ డీ ఈఈ వెంకటేశ్, ఇర్రిగేషన్ ఈఈ నారాయణ తదితరులు పాల్గొన్నారు.