రామప్ప ఈస్ట్ రోడ్డు పనుల్లో వేగం పెంచాలి : కలెక్టర్ దివాకర

రామప్ప ఈస్ట్ రోడ్డు పనుల్లో వేగం పెంచాలి : కలెక్టర్ దివాకర

వెంకటాపురం (రామప్ప), వెలుగు : రామప్ప టెంపుల్ ఈస్ట్ రోడ్డు, ఉపాలయమైన గొల్లగుడిని ములుగు కలెక్టర్ దివాకర సోమవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆలయ ఈస్ట్ రోడ్డు అభివృద్ధి పనుల్లో వేగం పెంచి, ఏరియా మ్యాపింగ్ సర్వే చేసి, బౌండ్రి పిల్లర్ ఫిక్స్ చేయాలన్నారు. కెనాల్ కు సంబంధించిన ఏరియా సర్వే చేసి హద్దులు ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. 

అంతకుముందు కలెక్టర్ గొల్లాల గుడిని సందర్శించి గుడి పైకప్పు, దెబ్బతిన్న శిఖరం, ధ్వంసమైన పైకప్పులను పరిశీలించారు. గుడి పూర్తి వివరాలు పురావస్తు శాఖ అధికారులు కలెక్టర్ కు వివరించారు. రాత్రి కాపలదారుడిని ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో పురావస్తుశాఖ అధికారి మల్లేశం, ఇర్రిగేషన్ డీఈ రవీందర్, తహసీల్దార్ సదానందం, ఎంపీడీవో రాజు తదితరులు పాల్గొన్నారు. 

ఇదిలాఉండగా, బీజేపీ ములుగు జిల్లా ఎండోమెంట్ ఇన్​చార్జి కన్వీనర్ గంగిశెట్టి రాజకుమార్ ఆధ్వర్యంలో రామప్ప టెంపుల్ పరిసరంలోని దుండగులు ధ్వంసం చేసిన గొల్లల గుడిని బీజేపీ జిల్లా అధ్యక్షుడు సిరికొండ బలరాం గ్రామస్తులు సోమవారం సందర్శించి, పరిశీలించారు. దీనిపై తక్షణమే అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు.