- డబ్బులు పంపించాలంటున్న సైబర్ నేరగాళ్లు
ములుగు, వెలుగు : ములుగు కలెక్టర్ దివాకర్ ఫేస్‌బుక్, వాట్సప్ అకౌంట్లు హ్యాక్ అయ్యాయి. కలెక్టర్ డీపీతో ఉన్న వాట్సప్ అకౌంట్ నుంచి పలువురు మెసేజ్‌లు వెళ్లాయి. ‘నేను ములుగు కలెక్టర్‌ను, మీటింగ్‌లో ఉన్నాను.. అర్జంట్‌గా డబ్బులు కావాలి’ అని 99 8886747021 నంబర్ నుంచి పలువురికి మెసేజ్‌లు వెళ్లాయి.
అమౌంట్ ఫోన్ పే చేసి స్క్రీన్‌షాట్ షేర్ చేయాలని వచ్చే మెసేజ్‌లకు ఎవరూ స్పందించవద్దని కలెక్టర్ బుధవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఎవరూ డబ్బులు సెండ్ చేయవద్దని, అలాంటి మెసేజ్‌లు వస్తే నంబర్‌ను వెంటనే బ్లాక్ చేయాలని సూచించారు.