ములుగు కలెక్టర్  పేరుతో నకిలీ ఫేస్ బుక్  అకౌంట్

ములుగు కలెక్టర్  పేరుతో నకిలీ ఫేస్ బుక్  అకౌంట్
  • పోలీసులకు ఫిర్యాదు చేసిన కలెక్టర్ 

ములుగు, వెలుగు: ములుగు కలెక్టర్  దివాకర టీఎస్  పేరుతో సైబర్  నేరగాళ్లు నకిలీ ఫేస్​బుక్​ ఖాతా సృష్టించి, డబ్బులు వసూలు చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు గుర్తించిన కలెక్టర్  వెంటనే స్పందించారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్​ మాట్లాడుతూ తన పేరు, ఫొటోతో ఫేస్ బుక్  ఐడీని సృష్టించి ఆఫీసర్లు, సోషల్  మీడియాలో యాక్టివ్ గా ఉండే వారి ఖాతాలకు ఫ్రెండ్  రిక్వెస్ట్  పంపిస్తున్నారని తెలిపారు.

వారు యాక్సెప్ట్  చేయగానే, డబ్బులు వసూలు చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలిసిందన్నారు. తన ఒరిజినల్  ఫేస్​బుక్  అకౌంట్  ద్వారా అందరినీ అలర్ట్​ చేశారు. తన పేరుతో ఎవరు డబ్బులు అడిగినా ఇవ్వవద్దని సూచించారు. వీలైనంత త్వరగా బ్లాక్  చేయమని కోరారు. దీనిపై కేసు నమోదు నమోదు చేసి సైబర్  నేరగాళ్లను పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు.