మొక్కలు ఎండిపోకుండా చూడాలి

ములుగు, వెలుగు: నర్సరీ, ఎవెన్యూ ప్లాంటేషన్లలో మొక్కలు ఎండిపోకుండా చూడాలని, నీళ్లు పడుతూ కాపాడుకోవాలని ములుగు కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. బుధవారం కలేక్టరేట్ లో డీఆర్డీఏ పీడీ శ్రీనివాస్ కుమార్, ఏపీడీ వెంకటనారాయణతో కలిసి కలెక్టర్ ఏపీవో, ఈసీలతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాబోయే వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని మొక్కలు నాటేందుకు నర్సరీల్లో మొక్కల పెంపకం చేపట్టాలని సూచించారు. ప్రస్తుతం ఎండల కారణంగా మొక్కలు ఎండిపోకుండా చూడాలన్నారు. ఉపాధి హామీ పథకంలో ఎక్కువ పనిదినాలు కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. కాగా, ములుగులోని పల్లె ప్రకృతి వనాన్ని, నర్సరీని అడిషనల్​కలెక్టర్ శ్రీజ ఆకస్మికంగా తనిఖీ చేసి, మొక్కల సంరక్షణకు చర్యలు తీసుకోవాలని సూచించారు.