‘ప్రసాద్ స్కీం’ పనులు త్వరగా పూర్తి చేయాలి : కలెక్టర్ దివాకర

‘ప్రసాద్ స్కీం’ పనులు త్వరగా పూర్తి చేయాలి : కలెక్టర్ దివాకర

వెంకటాపూర్ (రామప్ప), వెలుగు: యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప టెంపుల్ కి రానున్న రోజుల్లో విదేశీ పర్యాటకుల సంఖ్య భారీగా పెరగనుందని, ప్రసాద్ స్కీమ్ ద్వారా చేపట్టిన అభివృద్ధి పనులు త్వరగా పూర్తిచేయాలని ములుగు కలెక్టర్ దివాకర అన్నారు. రామప్పలో ప్రసాద్ స్కీమ్ ద్వారా చేపట్టిన అభివృద్ధి పనులను కలెక్టర్ సంబంధిత అధికారులతో కలసి మంగళవారం పరిశీలించారు.

ఆయా పనులను ఏప్రిల్ 20లోగా పూర్తి చేయాలని, రామప్ప పరిసర ప్రాంతాన్ని సుందరికరించి గ్రీనరీ పెంచాలని సూచించారు. కార్యక్రమంలో ఆర్డీవో వెంకటేశ్, డీపీవో దేవ్ రాజ్, అసిస్టెంట్ టూరిజం ప్రమోషన్ ఆఫీసర్ కుసుమ సూర్య కిరణ్, పర్యాటక అభివృద్ధి సంస్థ  ధనరాజ్ తదితరులు పాల్గొన్నారు.