అసత్యాలు ప్రచారం చేస్తే చర్యలు : ఇలా త్రిపాఠి

ములుగు, వెలుగు : సోషల్‌‌ మీడియాలో అసత్యాలు ప్రచారం చేస్తే చర్యలు తప్పవని ములుగు కలెక్టర్‌‌ ఇలా త్రిపాఠి, ఎస్పీ గౌస్‌‌ ఆలం హెచ్చరించారు. ఎన్నికల నిర్వహణపై గురువారం ఐటీడీఏ పీవో అంకిత్‌‌తో కలిసి మీడియాతో మాట్లాడారు. ఓటర్‌‌ లిస్ట్‌‌లో పేరు లేని వారు ఈ నెల 31 వరకు నమోదు చేసుకోవచ్చని చెప్పారు. నియోజకవర్గంలో ఎన్నికల నిర్వహణకు 303 పోలింగ్‌‌ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.


ALSO READ: నల్గొండలో గెలుపే లక్ష్యంగా ‘గడప గడపకు బీజేపీ’    

ఓటర్లను ప్రలోభాలకు గురి చేసినా, బెదిరించినా, తప్పుడు ప్రచారాలు చేసినా చట్టప్రకారం చర్యలు తీసుకోనున్నట్లు హెచ్చరించారు. రాజకీయ పార్టీలు మీటింగ్‌‌లు నిర్వహించుకునేందుకు సింగిల్‌‌ విండో సిస్టం ద్వారా పర్మిషన్‌‌ ఇస్తామని, ఎవరు ముందు అప్లై చేసుకుంటే వారికే అనుమతి ఇవ్వనున్నట్లు చెప్పారు. ఎలక్షన్లకు సంబంధించి 1950 టోల్‌‌ ఫ్రీ నంబర్‌‌ ద్వారా, సీ విజిల్‌‌ యాప్‌‌ ద్వారా ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. సమావేశంలో ఎంసీఎంసీ కమిటీ మెంబర్‌‌ శ్రీధర్, డీపీఆర్‌‌వో రఫిక్‌‌ పాల్గొన్నారు.