
రంగారెడ్డి జిల్లా చేవెళ్లలోని కొండా విశ్వేశ్వర్ రెడ్డి గ్రౌండ్ లో ఆగస్టు 26వ తేదీన నిర్వహించబోయే ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ సభను విజయవంతం చేయాలని ములుగు కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క పిలుపునిచ్చారు. గురువారం రోజు (ఆగస్టు 24న) చేవెళ్ల సభాస్థలిని పార్టీ నాయకులతో కలిసి పరిశీలించారు ఎమ్మెల్యే సీతక్క.
తొమ్మిదేళ్లుగా పరిపాలిస్తున్న బీఆర్ఎస్ పార్టీ రాష్ర్ట ప్రజలందరికీ అన్యాయం చేసిందన్నారు ములుగు ఎమ్మెల్యే సీతక్క. బీఆర్ఎస్ పార్టీకి తగిన గుణపాఠం చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్నారు. రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ ను ఓడించాలని పిలుపునిచ్చారు. దళితుడిని ముఖ్యమంత్రి చేస్తానని హామీ ఇచ్చిన కేసీఆర్.. ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. కేజీ టు పీజీ విద్య ఎక్కడ పోయిందన్నారు.