
తాడ్వాయి, వెలుగు: ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం సమ్మక్క సారలమ్మ వనదేవతలను మంగళవారం ములుగు అడిషనల్ కలెక్టర్ మహేందర్ జీ దర్శించుకున్నారు. ఇటీవల అడిషనల్ కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన ఆయన తొలిసారిగా మేడారం వచ్చారు. ఈ సందర్భంగా ఎండోమెంట్ అధికారులు పూజారులు స్వాగతం పలికి, సత్కరించారు. కొబ్బరికాయలు కొట్టి గద్దెల వద్ద పసుపు కుంకుమ శిరసారే పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయన వెంట తహసీల్దార్ తోట రవీందర్ ఉన్నారు.