రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టాలి : సీహెచ్​.మహేందర్​ జీ

రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టాలి : సీహెచ్​.మహేందర్​ జీ

ములుగు, వెలుగు : జిల్లాలో ప్రమాదాలు జరిగే ప్రాంతాలను గుర్తించి నివారణకు చర్యలు తీసుకోవాలని అడిషనల్​ కలెక్టర్​ సీహెచ్​.మహేందర్​ జీ సంబంధిత అదికారులకు సూచించారు. శుక్రవారం కలెక్టరేట్​లో జిల్లాలోని జాతీయ, రాష్ట్ర రహదారులపై  ప్రమాదాలు తగ్గించడానికి అవలంభించాల్సిన విధానాలపై ఆర్డీవో వెంకటేశ్, డీఎస్పీ రవీందర్ తో కలసి జిల్లా రోడ్డు సేఫ్టీ మీటింగ్ నిర్వహించారు. 

ఈ సందర్భంగా ఆయన  మాట్లాడుతూ రహదారులపై ఎక్కువగా ప్రమాదాలు చోటుచేసుకునే ప్రాంతాల్లో ప్రమాదాలు జరగకుండా నివారించడానికి పోలీసు, రోడ్లు, భవనాలు, ఎక్సైజ్, ఆర్టీవో, ఆర్టీసీ, తదితర శాఖలు సమన్వయంతో పని చేయాలని ఆదేశించారు. 163 హైవేపై ఎక్కువగా ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని, ఆ బ్లాక్ స్పాట్స్ వద్ద ఎటువంటి చర్యలు తీసుకోవాలి అనే విషయాలపై సమావేశంలో చర్చించారు. సమావేశంలో డీఎస్పీ రవీందర్ , జిల్లా రవాణా శాఖ అధికారి శ్రీనివాస్, ఆర్టీసీ అధికారులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.