వేసవిలో తాగునీటి ఎద్దడి రాకుండా చర్యలు : కలెక్టర్ టీఎస్ దివాకర

వేసవిలో తాగునీటి ఎద్దడి రాకుండా చర్యలు : కలెక్టర్ టీఎస్ దివాకర

వెంకటాపురం, వెలుగు:  వేసవిలో తాగునీటి సమస్యలు రాకుండా ఆఫీసర్లు ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేయాలని ములుగు జిల్లా కలెక్టర్ దివాకర అన్నారు.  బుధవారం వాజేడు మండలంలో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా మండల కేంద్రంలోని ఎంపీడీఓ ఆఫీసులో ఐటీడీఏ పీవో చిత్రా మిశ్రా, అదనపు కలెక్టర్లు మహేందర్  జి. సంపత్ రావుతో కలిసి సమీక్ష నిర్వహించారు.  గ్రామాల్లో నీటి ఎద్దడి   ఏర్పడకుండా నీటి వనరులను వినియోగించుకోవాలన్నారు.  

ఆయా విత్తన కంపెనీల నుంచి నష్టపరిహారం అందించే విధంగా చర్యలు తీసుకున్నామని చెప్పారు. రెవెన్యూ ఆఫీసులో నష్టపోయిన రైతుల వివరాలను అందుబాటులో ఉన్నాయన్నారు.  తమ పేర్లు లేని రైతులు ఈ రోజు గురువారం నమోదు చేసుకోవచ్చని తెలిపారు. వాజేడు మండలం మండపాక గ్రామ సమీపంలో ప్రభుత్వ భూమిలో రెండు సంవత్సరాలుగా ఉంటున్నామని తాగునీరు, విద్యుత్ సౌకర్యం కల్పించాలని ఆదివాసీలు కలెక్టర్‌‌ కు వినతిపత్రం సమర్పించారు.