ములుగు, వెలుగు : ఎలక్షన్ రూల్స్‌ను పకడ్బందీగా అమలు చేయాలని ములుగు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు. ఎన్నికల నిర్వహణపై ఏఈఆర్‌వోలు, ఎక్సైజ్ ఆఫీసర్లతో శుక్రవారం కలెక్టరేట్‌లో మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పోలింగ్ కేంద్రాల్లో విద్యుత్, టాయిలెట్స్, మంచినీరు, ఫర్నీచర్, వసతులు కల్పించాలని సూచించారు.
అక్రమంగా మద్యం తరలింపు, నాటుసారా తయారీ, బెల్ట్ షాపులు నడిపే వారిపై కేసులు నమోదు చేయాలని ఎక్సైజ్ ఆఫీసర్లను ఆదేశించారు. షెడ్యూల్ వెలువడిన వెంటనే కోడ్ అమల్లోకి వస్తుందని, ఎలక్షన్లు ప్రశాంతంగా ముగిసేందుకు సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని సూచించారు. సమావేశంలో ఆర్డీవో కె.సత్యపాల్‌రెడ్డి, డీపీవో వెంకయ్య, ఎక్సైజ్ ఆఫీసర్లు లింగాచారి, సుధీర్‌కుమార్, ఏఈఆర్‌వోలు విజయ్‌భాస్కర్, సలీం, రాజ్‌కుమార్, రవీందర్, సంధ్యారాణి, శివకుమార్, రమాదేవి పాల్గొన్నారు.