
ఏటూరునాగారం, వెలుగు : దుప్పిని చంపి మాంసాన్ని అమ్ముతున్న ముగ్గురు వ్యక్తులను ములుగు జిల్లా ఏటూరునాగారంలో శనివారం ఫారెస్ట్ ఆఫీసర్లు పట్టుకున్నారు. డీఆర్‌వో నరేందర్ తెలిపిన వివరాల ప్రకారం... ఏటూరునాగారంలోని అంబేద్కర్ కాలనీలో కొందరు వ్యక్తులు దుప్పి మాంసాన్ని అమ్ముతున్నారని సమాచారం అందడంతో సిబ్బందితో కలిసి దాడి చేశారు. మాంసాన్ని అమ్ముతున్న తుమ్మ మహేశ్, మార జగన్, దుర్గం రామును అదుపులోకి తీసుకోగా, ఆకుల శంకర్ పరారీలో ఉన్నాడని డీఆర్‌వో తెలిపారు. నిందితుల వద్ద నుంచి దుప్పి తల, కాళ్లు, మాంసం స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు చెప్పారు.