సర్వేలో ములుగు జిల్లా ఫస్ట్

సర్వేలో ములుగు జిల్లా ఫస్ట్
  • మంత్రి సీతక్క అభినందనలు

ములుగు, వెలుగు : రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వేలో ములుగు జిల్లాలో 87.1శాతంతో మొదటిస్థానంలో నిలిచినట్లు పంచాయతీరాజ్​ శాఖ మంత్రి సీతక్క సంతోషం వ్యక్తం చేశారు. ఈమేరకు సోమవారం ప్రకటన విడుదల చేశారు. సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ కుల సర్వేలో భాగంగా రాష్ర్టంలోనే ములుగు జిల్లా మొదటి స్థానంలో నిలవడం అధికారుల పనితీరుకు నిదర్శనమన్నారు.

జిల్లా కలెక్టర్, జిల్లా, మండల, గ్రామస్థాయి అధికారులు, సర్వేలో భాగస్వాములుగా ఉన్న ప్రజలకు మంత్రి సీతక్క ధన్యవాదాలు తెలిపారు. సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే ద్వారా ఇచ్చిన వాస్తవిక అంచనాలు నూతన రాష్ట్ర ప్రభుత్వానికి దిశా నిర్దేశం చేయడమే కాకుండా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలులో కీలకంగా వ్యవహరిస్తుందన్నారు. సమగ్ర కుటుంబ సర్వేలో ప్రజలు అందరూ భాగస్వాములు కావాలని మంత్రి  సీతక్క పిలుపునిచ్చారు.