
- మిల్లు ఓనర్ పై క్రిమినల్ కేసు నమోదు
- సివిల్ సప్లై డీఎం రాంపతి వెల్లడి
ములుగు, వెలుగు: రూ. కోట్ల విలువైన ధాన్యాన్ని పక్కదారి పట్టించిన మిల్లును ములుగు జిల్లా సివిల్సప్లై అధికారులు సీజ్‌చేశారు. మిల్లులో తనిఖీలు చేసి పెద్దమొత్తంలో ఫ్రాడ్జరిగినట్లు తేల్చారు. మల్లంపల్లి మండలం రాంచంద్రాపూర్‌లోని ఉమా బిన్ని రైస్‌మిల్లులో శుక్రవారం డిప్యూటీ తహసీల్దార్లు(సివిల్సప్లై) నితీశ్, రాంచందర్, ఎంఆర్ఐ రమేశ్తనిఖీ చేసినట్టు డీఎం రాంపతి తెలిపారు.
2023–--24 సంవత్సరానికి చెందిన సుమారు 604.628 మెట్రిక్‌టన్నుల బియ్యాన్ని ప్రభుత్వానికి ఇవ్వలేదని గుర్తించామని పేర్కొన్నారు. రూ.2.16 కోట్ల విలువైన ధాన్యాన్ని పక్కదారి పట్టించినట్లు తేల్చినట్టు చెప్పారు. అనంతరం మిల్లును సీజ్ చేసిన ఓనర్ భూక్యా ఉమాదేవిపై క్రిమినల్కేసు నమోదు చేసినట్టు తెలిపారు.
కాగా.. సివిల్ సప్లై అధికారులు రెండు రోజుల కిందనే మిల్లులో తనిఖీలు చేపట్టారని స్థానికులు చెబుతుండగా.. శుక్రవారం ప్రెస్నోట్రిలీజ్చేయడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రైస్‌మిల్లర్ల అసోసియేషన్ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టి వెంటనే సీజ్చేసిన ఆఫీసర్లు మూడు రోజుల తర్వాత వెల్లడించడంతో విమర్శలు వస్తున్నాయి.