తాడ్వాయి, వెలుగు: ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం సమక్క, సారలమ్మ, వన దేవతలను బుధవారం దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, మురళీధర్ రావు దంపతులు కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. వారికి ఎండోమెంట్ అధికారులు, మేడారం పూజారులు ఘన స్వాగతం పలికారు. మేడారం చేరుకున్న కొండా దంపతులు మనుమడు శ్రేయాన్స్ మురళీకృష్ణ పుట్టు వెంట్రుకలు సమర్పించుకున్నారు.
అనంతరం వనదేవతల గద్దెల వద్ద గిరిజన సంస్కృతి సంప్రదాయాల ప్రకారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి కొండ సురేఖ మాట్లాడుతూ సమ్మక్క సారక్క జాతరను జాతీయ పండుగగా గుర్తించేదాకా కాంగ్రెస్ ప్రభుత్వం, పట్టు పడుతుందన్నారు. దేవాదాయ శాఖ తరఫున మంత్రిగా తాను, మంత్రి సీతక్క ఈ ప్రాంత అభివృద్ధి కోసం కృషి చేస్తున్నామని తెలిపారు.