
ములుగు జిల్లాలో పోడు రైతులకు, అటవీశాఖ అధికారుల మధ్య ఘర్షణ జరిగింది. ఏటూరు నాగారం మండలం చిన్న బోయినపల్లిలో ఈ ఘటన జరిగింది. పొలం దున్నుతుండగా పోడు రైతులను అటవీశాఖ అధికారులు, సిబ్బంది అడ్డుకున్నారు. దీంతో అటవీశాఖ అధికారులతో పోడు రైతులు వాగ్వాదానికి దిగారు.
ALSO READ :ఐదు కోట్ల ఆస్తి ఇచ్చా.. కొడుకులు తిండి పెట్టడం లేదు.. ప్రజావాణిలో ఓ తండ్రి ఆవేదన
ఇరు వర్గాల మధ్య గొడవ జరిగింది. తీవ్ర తోపులాట చోటు చేసుకుంది. కొంతమంది పోడు రైతులను పోలీసులు బలవంతంగా అదుపులోకి తీసుకున్నారు. అటవీశాఖ అధికారుల తీరుపై పోడు రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.