వాజేడు ఎస్ఐ ఆత్మహత్యకు ప్రేమ వ్యవహారమే కారణమా?.. గొడవపడ్డ అమ్మాయి ఎవరు.?

ములుగు జిల్లా వాజేడు ఎస్ఐ రుద్రారపు హరీష్ ఆత్మహత్య  కలకలం రేపుతోంది.  ఏటూరు నాగారం మండల పరిధి ముళ్లకట్ట సమీపంలోని హరిత రిసార్ట్స్‎లో డిసెంబర్ 2న  తన సర్వీస్ రివాల్వర్‎తో కాల్చుకొని ఎస్ఐ సూసైడ్ చేసుకున్న సంగతి తెలిసిందే.  సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని  పరిశీలించారు  జిల్లా ఎస్పీ శబరీష్.  ఘటన జరిగిన రూం నంబర్ 107 లో ఆధారాలు సేకరించారు ఫోరెన్సిక్ నిపుణులు.  వ్యక్తిగత కారణాలే SI ఆత్మహత్యకు కారణమని.. ప్రత్యేక అధికారిని విచారణ అధికారిగా నియమిస్తున్నామని చెప్పారు ఎస్పీ శబరీష్ . విచారణ అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని తెలిపారు. మరో వైపు  ఆత్మహత్య చేసుకున్న గది ముందు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు ఎస్సై  కుటుంబ సభ్యులు.

ఆ అమ్మాయి ఎవరు.?

డిసెంబర్ 2న హరిత రిసార్ట్ లో  ఉదయం 6 గంటలకు  డ్రైవర్ కి కాల్ చేసి తనను పికప్ చేసుకోవాలని ఎస్సై హరీశ్  చెప్పాడు.  డ్రైవర్ వచ్చే సరికి తుపాకీతో కాల్చుకున్నాడు హరీశ్.  ఆత్మహత్య చేసుకున్న ఎస్ ఐ హరీశ్ ది జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం వెంకటేశ్వర్ల గ్రామం. 2020 బ్యాచ్ కు చెందిన హరీశ్ కు ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. అయితే ఎస్సై హరీశ్  వేరే అమ్మాయిని ప్రేమిస్తున్నాడని.... సూసైడ్ చేసుకున్న రోజు  ఆ అమ్మాయి రిసార్ట్ కు కూడా వచ్చినట్లు తెలుస్తోంది.  ఆ అమ్మాయితో  హరీశ్ గొడవపడ్డాడని..  తనను వదలిపెట్టాలంటూ రిక్వెస్ట్ చేశాడని .. ఆమె ససేమిరా అనడంతోనే  మనస్తాపానికి గురై సర్వీస్ రివాల్వర్ తో  కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు చర్చజరుగుతోంది. ఇంతకీ ఆ అమ్మాయి ఎవరు..? వారి మధ్య గొడవేంటి.?ఇది ఎంత వరకు నిజమనేది తెలియాల్సి ఉంది..