ములుగు, వెంకటాపూర్ (రామప్ప), వెలుగు : ములుగు జిల్లాను అన్ని రంగాల్లో డెవలప్ మెంట్ చేస్తామని కలెక్టర్ టి.ఎస్ దివాకర అన్నారు. గురువారం కలెక్టరేట్‌లో అడిషనల్ కలెక్టర్, సి.హెచ్ మహేందర్‌తో కలిసి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ..జిల్లాలోని పర్యాటక ప్రాంతాలను ఆకట్టుకునేలా తీర్చిదిద్దుతామన్నారు. మూతబడిన బిల్ట్ ఫ్యాక్టరీని తిరిగి తెరిపించడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు.
400 ఎకరాల స్థలంలో పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకోవడంతో పాటు ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. టీజీవో సంఘ నాయకులు ములుగు జిల్లా అధ్యక్షుడు సంపత్ రావు ఆధ్వర్యంలో మంత్రి సీతక్క, జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్ కు పూల మొక్కలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.
తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ తరపున హాస్టల్ విద్యార్థులకు కలెక్టర్ ద్వారా దుప్పట్లు అందజేశారు. జిల్లా పౌర సంబంధాల శాఖ అధికారి ఎండీ. రఫిక్, జూనియర్ అసిస్టెంట్ కే. శంకర్ తదితరులు పాల్గొన్నారు.