
సిద్దిపేట జిల్లా ములుగు(హైదరాబాద్)లోని ఫారెస్ట్ కాలేజ్ అండ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ బీఎస్సీ ఫారెస్ట్రీ కోర్సులో అడ్మిషన్స్‌కు అప్లికేషన్స్ కోరుతోంది.
అర్హత: ఇంటర్మీడియట్(పీసీబీ/ పీసీఎం/ పీసీఎంబీ)తో పాటు టీఎస్ ఎంసెట్-–2023 ర్యాంకు సాధించి ఉండాలి.
దరఖాస్తులు: అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్లో జులై 12 వరకు దరఖాస్తు చేసుకోవాలి. అప్లికేషన్ ఫీజు రూ.2000 (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు రూ.1000) చెల్లించాలి. రూ.500 ఆలస్య రుసుముతో జులై 15 వరకు అప్లై చేసుకోవచ్చు. పూర్తి సమాచారం కోసం www.fcrits.in వెబ్సైట్లో సంప్రదించాలి.