ములుగు, జనగామ, తొర్రూరులో ప్రధాని ఫొటోకు క్షీరాభిషేకం

ములుగు/జనగామ అర్బన్‌‌‌‌/తొర్రూరు, వెలుగు : ట్రైబల్‌‌‌‌ యూనివర్సిటీ, పసుపు బోర్డు ప్రకటనను హర్షిస్తూ సోమవారం ములుగు, జనగామ, తొర్రూరులో బీజేపీ లీడర్లు ప్రధాని మోదీ ఫొటోకు క్షీరాభిషేకం చేశారు. ములుగులో బీజేపీ జిల్లా అధ్యక్షుడు చింతలపూడి భాస్కర్‌‌‌‌రెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్‌‌‌‌ అజ్మీర ప్రహ్లాద్‌‌‌‌ ఆధ్వర్యంలో డీఎల్‌‌‌‌ఆర్‌‌‌‌ ఫంక్షన్‌‌‌‌హాల్‌‌‌‌ నుంచి బైక్‌‌‌‌ ర్యాలీ తీశారు.

ALSO READ : అభివృద్ధి దిశగా కాంగ్రెస్​ మేనిఫెస్టో : శ్రీధర్ బాబు

జనగామలో జిల్లా అధ్యక్షుడు ఆరుట్ల దశమంతరెడ్డి, గిరిజన మోర్చా జిల్లా అధ్యక్షుడు రాంకోటినాయక్‌‌‌‌, తొర్రూరులో బీఏపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పెదగాని సోమయ్య, గిరిజన మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి రాయపురం రాజకుమార్‌‌‌‌ ఆధ్వర్యంలో మోదీ ఫొటోకు క్షీరాభిషేకం చేశారు.