ములుగు/జనగామ : గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రారంభించిన పథకాలు క్షేత్ర స్థాయిలో ప్రజలకు అందుతున్నాయని కాంగ్రెస్ లీడర్లు అన్నారు. మంగళవారం ఆయా ప్రాంతాల్లో సీఎం రేవంత్ రెడ్డి ఫొటోకు క్షీరాభిషేకాలు చేశారు. ములుగు మండలం జీవంతరావుపల్లి గ్రామంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోతు రవిచందర్ రేవంత్ రెడ్డి, మంత్రి సీతక్క ఫొటోలకు క్షీరాభిషేకం చేశారు.
జనగామ మండలంలోని ఎర్రకుంట తండా లో జనగామ మార్కెట్ కమిటీ చైర్మన్ బనుక శివరాజ్ యాదవ్ ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి ఫ్లెక్సీకి క్షీరాభిషేకం చేశారు. ప్రజా పాలనలో భాగంగా తండాలోని ప్రతీ కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. మండల పార్టీ అధ్యక్షులు లింగాల నర్సిరెడ్డి, మాజీ ఎంపీటీసీ భోజ్యా నాయక్ పాల్గొన్నారు.