కేసులతో ప్రతిపక్షాలను..భయపెట్టాలని చూస్తున్రు

  • ములుగు ఎమ్మెల్యే సీతక్క

పాలకుర్తి (దేవరుప్పుల), వెలుగు : ప్రతిపక్ష నాయకులపై కేసులు పెట్టి భయపెట్టాలని చూస్తున్నారని ములుగు ఎమ్మెల్యే సీతక్క విమర్శించారు. జనగామ జిల్లా దేవరుప్పుల మండలం రామరాజుపల్లి, నీర్మాల గ్రామాల్లో గురువారం నిర్వహించిన ‘పల్లె పల్లెకు కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ – గడప గడపకు ఝాన్సమ్మ’ కార్యక్రమానికి ఆమె హాజరయ్యారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ 123 సంవత్సరాల కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ అదే విధంగా ఉందని, 20 ఏళ్ల కింద ఏర్పడిన టీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ మాత్రం బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌లా మారిందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ ఇచ్చిన ఆరు గ్యారంటీలను ప్రజల వద్దకు చేర్చే ఉద్దేశంతోనే గడప గడపకు కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు చెప్పారు.

తెలంగాణలో కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. పాలకుర్తి నియోజకవర్గ ప్రజలకు ఏమీ చేయలేని మంత్రి దయాకర్‌‌‌‌‌‌‌‌రావు ములుగుకు వచ్చి నీతులు చెబుతున్నారని విమర్శించారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ను ఆదరించాలని, ప్రజలకు సేవ చేయాలన్న ఉద్దేశంతో రాజకీయాల్లోకి వచ్చిన హనుమాండ్ల ఝాన్సీరెడ్డిని గెలిపించాలని పిలుపునిచ్చారు. బ్లాక్‌‌‌‌‌‌‌‌ కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ రాపాక సత్యనారాయణ, దేవరుప్పుల, పాలకుర్తి మండలాల అధ్యక్షులు పెద్ది కృష్ణమూర్తి గౌడ్‌‌‌‌‌‌‌‌, కుమారస్వామిగౌడ్,  రాజేశ్‌‌‌‌‌‌‌‌నాయక్‌‌‌‌‌‌‌‌ పాల్గొన్నారు.