దోచుకున్న డబ్బుతో ఓట్లు కొంటున్నరు : సీతక్క

ములుగు, వెలుగు : బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ లీడర్లు పదేళ్లలో దోచుకున్న డబ్బుతో ఓట్లు కొనేందుకు వస్తున్నారని ములుగు ఎమ్మెల్యే సీతక్క విమర్శించారు. ఎన్ని కుట్రలు చేసిన రాష్ట్రంలో కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ గెలవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ములుగు మండలంలోని మల్లంపల్లి, మంచినీళ్లపల్లి, హుమ్మాయినగర్‌‌‌‌‌‌‌‌లో ఆదివారం ప్రచారం నిర్వహించారు.

ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ లీడర్లు డబ్బును నమ్ముకుంటే.. తాను ప్రజలను నమ్ముకున్నానని చెప్పారు. తాను గెలిస్తే ప్రజలు గెలిచినట్లేనని, దొరల పాలన కావాలో.. ప్రజా పాలన కావాలో తేల్చుకోవాలని సూచించారు. కాంగ్రె​స్‌‌‌‌‌‌‌‌ అధికారంలోకి వస్తే ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తామని చెప్పారు. కార్యక్రమంలో టీపీసీసీ సభ్యులు రవళిరెడ్డి, మల్లాడి రాంరెడ్డి, మాజీ సర్పంచ్‌‌‌‌‌‌‌‌ గోల్కొండ రవి పాల్గొన్నారు.

ALSO READ :కాంగ్రెస్ పథకాలకు గ్యారంటీ లేదు: చంటి క్రాంతికిరణ్​