వచ్చేది ఇందిరమ్మ రాజ్యమే : సీతక్క

  •    ములుగు ఎమ్మెల్యే సీతక్క 

కొత్తగూడ,వెలుగు : తెలంగాణలో వచ్చేది ఇందిరమ్మ రాజ్యమేనని ములుగు ఎమ్మెల్యే సీతక్క అన్నారు. మహబూబాబాద్​ జిల్లా కొత్తగూడలో మంగళవారం కాంగ్రెస్​  కార్యకర్తల మీటింగ్​లో ఆమె మాట్లాడుతూ..  తొమ్మిదేళ్ళ పాలనలో బీఆర్​ఎస్​ పార్టీ ఒక్క రేషన్​ కార్డు కూడా ఇవ్వలేదని విమర్శించారు. కాంగ్రెస్​  అధికారంలోకి రాగానే పోడు భూములకు శాశ్వత పట్టాలు, గ్యాస్​కు ఐదు వందలు, కాలేజీ స్టూడెంట్లకు ఎలక్ర్టానిక్​ స్కూటీలు అందచేస్తామన్నారు. ప్రతి కార్యకర్త కాంగ్రెస్​  గెలుపునకు కృషి చేయాలని కోరారు.  

వేలుబెల్లి, పెగడపల్లి గ్రామాలకు చెందిన పలువురు వివిధ పార్టీల నుంచి  కాంగ్రెస్​లో చేరిన వారికి కండువాలు కప్పి ఆహ్వానించారు. అనంతరం ఎంపీడీవో ఆఫీస్​లో లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి చెక్కులను  అందించారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు వజ్జ సారయ్య, ఎంపీపీ విజయారూప్​సింగ్​, జడ్పీటీసీ పుష్పలత,వైస్​ ఎంపీపీ జంపయ్య,లీడర్లు సుంకరబోయిన మొగిలి, కారోజ్​ రమేశ్​​, ఉల్లెంగుల రమేశ్​,  పాటు ఎంపీటీసీలు పాల్గొన్నారు.