సమన్వయంతో పనిచేసి జాతరను సక్సెస్‌‌‌‌‌‌‌‌ చేయాలి : గౌస్‌‌‌‌‌‌‌‌ ఆలం

ములుగు/తాడ్వాయి, వెలుగు : సమన్వయంతో పనిచేసి మేడారం జాతరను సక్సెస్‌‌‌‌‌‌‌‌ చేయాలని ములుగు ఎస్పీ గౌస్‌‌‌‌‌‌‌‌ ఆలం పిలుపునిచ్చారు. సమ్మక్క, సారలమ్మ పూజారుల సంఘం అభ్యుదయ ఫౌండేషన్‌‌‌‌‌‌‌‌ సభ్యులతో శనివారం ఎస్పీ మీటింగ్‌‌‌‌‌‌‌‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరొందిన మేడారం జాతర సక్సెస్‌‌‌‌‌‌‌‌ కోసం పోలీస్‌‌‌‌‌‌‌‌ డిపార్ట్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌ ఆధ్వర్యంలో ఇప్పటి నుంచే ప్లాన్‌‌‌‌‌‌‌‌ చేస్తున్నట్లు చెప్పారు.

జాతరకు లక్షలాది తరలిరానున్నందున పోలీసులతో పాటు, స్థానిక యువత సహకారం అవసరమన్నారు. జాతర టైంలో ఎదురయ్యే సమస్యలు, తీసుకోవాల్సిన చర్యలపై పూజారుల సంఘం సభ్యులు ఎస్పీకి వివరించారు. సమావేశంలో డీఎస్పీ రవీందర్, ఎస్‌‌‌‌‌‌‌‌బీ ఇన్స్‌‌‌‌‌‌‌‌పెక్టర్‌‌‌‌‌‌‌‌ కిరణ్, పస్రా సీఐ శంకర్‌‌‌‌‌‌‌‌, ఎస్సై ఓంకార్‌‌‌‌‌‌‌‌ యాదవ్‌‌‌‌‌‌‌‌, యూత్‌‌‌‌‌‌‌‌ అధ్యక్షుడు భోజారావు, అనిల్, రమేశ్‌‌‌‌‌‌‌‌ పాల్గొన్నారు.