ములుగు, వెలుగు : ములుగు జిల్లా కేంద్రంలో బుధవారం పోలీసులు, సీఆర్‌పీఎఫ్ భద్రతా బలగాలు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించాయి. ఈ సందర్భంగా ఎస్పీ గౌష్ ఆలం మాట్లాడుతూ ఓటుహక్కుపై ప్రజల్లో చైతన్యం నింపేందుకు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించినట్లు చెప్పారు. ప్రతి ఒక్కరూ ధైర్యంగా ఓటు వేయాలని, తాము అండగా ఉంటామని చెప్పారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ సదానందం, సీఆర్‌పీఎప్ కమాండెంట్ రూడీ వారిఘీసే, డీఎస్పీ రవీందర్, సీఐలు రంజిత్‌కుమార్, దయాకర్, శంకర్ పాల్గొన్నారు.
ALS0 READ: కరీంనగర్లో ఎలుగుబంటి సంచారం