ఏజెన్సీలోని ప్రజలు నిర్భయంగా ఓటువేయాలి : ఎస్పీ శబరీష్

ములుగు, వెలుగు: పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో జిల్లాలోని మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేశామని, ఏజెన్సీలో ప్రజలు నిర్భయంగా ఓటు హక్కు వినియోగించుకోవాలని ములుగు ఎస్పీ శబరీష్ సూచించారు. ఎన్నికల విధుల్లో పాల్గొనేందుకు వివిధ జిల్లాల నుంచి వచ్చిన అటవీ శాఖ, టీఎస్​ఎస్​పీ బలగాలకు శనివారం ములుగులో ఎన్నికల నియమావళిపై సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పోలింగ్ కేంద్రాల్లోకి మొబైల్ ఫోన్లను అనుమతించొద్దని, విధ్వంసకర చర్యలపై పకడ్బందీ నిఘా ఉంచాలన్నారు. కార్యక్రమంలో అడిషనల్​ఎస్పీ సదానందం, డీఎస్పీ రవీందర్, స్పెషల్ బ్రాంచ్ ఇన్​స్పెక్టర్​శ్రీధర్, సీఐలు రంజిత్ కుమార్, రోహిత్, ఎస్సై రామకృష్ణ, ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.